Thursday, November 23, 2006

కొత్త బైకండీ బాబూ ఒక్కసారి తోలండి

మిత్రులారా !


పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్న ఈరోజుల్లో మనం కూడా ఇలాంటి బైకొకటి తీయాల్సిందే కదూ!



Vasu Present's

COWASAKI (1000cc)


ఉత్తినే చూస్తూ ఉంటే బండి కదలదండీ బండి మీద ఎలక(mouse)తో ఒకసారి ఒత్తి(click)తే అప్పుడు పరిగెడుతుంది వేరే కిటికీ(window)లో!

How is iTTTTu........

తెలివైన సిఎం- తెలివైన మంత్రి (చదవండి నవ్వండి!)

ఒకసారి సిఎం గారు ఒక కంపెనీకి అతిథిగా వెళ్ళారు.

అక్కడ ఎండీని "ఏమండీ మీ దగ్గర పనిచేసేవాళ్ళు తెలివైన వారో కాదో మీరు ఎలా తెలుసుకుంటారు" అని అడిగారు.

అప్పుడు వెంటనే ఆయన " నేనిప్పుడే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెబితే అతను తెలివైనవాడో కాదో తెలిసిపోతుంది" అని తన క్రింది ఉద్యోగికి శేఖర్ కి ఫోన్ చేసి "ఏమయ్యా, మీ తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు, అందులో ఒకరు మీ అన్నయ్య,ఒకరు మీ చెల్లి మరి మిగిలిన ఒకరు ఎవ్వరు ?"

శేఖర్: "అదినేనే సార్! శేఖర్ ని"

తరువాత సిఎం తన మంత్రులు ఎలాంటివారో తెలుసుకోవాలని ఒక మంత్రికి ఫోన్ చేసి అదే ప్రశ్న అడిగారు.

అప్పుడు మంత్రి నేను మళ్ళీ చెసి చెబుతాను సార్ అనిఫోన్ పెట్టేసి కలెక్టర్ కి ఫోన్ చేసి అదేప్రశ్న అడిగారు.

అప్పుడు ఆ కలెక్టర్ " అదినేనే సార్! వెంకట్ ని" అని చెప్పారు.

వెంటనే మంత్రి సిఎం గారికి ఫోన్ చేసి " అదినేనే సార్ వెంకట్ ని" అని చెప్పారు.

అప్పుడు సిఎం గారు చెప్పారు " నీ మొహం అది వెంకట్ కాదు శేఖర్"

Wednesday, November 15, 2006

నమస్కారం! వాసుగాడు వచ్చేసాడండీ(పరిచయము)

నమస్కారం!

తెలుగు బ్లాగస్తులకు, తెవికిపిడియన్లకు మరియు తెలుగు వారికందరికిన్ని నా హృదయపూర్వక నమస్సుమాంజలి.


ఇకపొతే నేను ఈ మధ్యనే తెలుగు బ్లాగులను, తెవికిపెడియాను దర్శించితిని.

ఆహా! ఏమి మన తెలుగు భాషయేనా ఈ వల(net)లో ఇంత వెలుగు వెలుగుచున్నది అని ఆశ్చర్యపోతిని.

ఇక తప్పదు మనం కూడా మన తెలుగు భాషాభివృద్ధికి మన మనస్సు పెట్టాల్సిందేననిపించింది.

ఈసారి మంచి తెలుగు కబుర్లతో మీ ముందుకొస్తాను.

ఇట్లు

మీ వాసుగాడు

తేట తేట తెలుగులా!