నమస్కారం!
తెలుగు బ్లాగస్తులకు, తెవికిపిడియన్లకు మరియు తెలుగు వారికందరికిన్ని నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
ఇకపొతే నేను ఈ మధ్యనే తెలుగు బ్లాగులను, తెవికిపెడియాను దర్శించితిని.
ఆహా! ఏమి మన తెలుగు భాషయేనా ఈ వల(net)లో ఇంత వెలుగు వెలుగుచున్నది అని ఆశ్చర్యపోతిని.
ఇక తప్పదు మనం కూడా మన తెలుగు భాషాభివృద్ధికి మన మనస్సు పెట్టాల్సిందేననిపించింది.
ఇలా ఎందుకన్నానంటే ఈకాలం పిల్లలు పుడుతునే మమ్మీ, డాడీ అంటూ పిలుస్తున్నారు (తల్లిదండ్రులే అలా పిలిపించుకొంటున్నారు). మరి వీరు తర్వాతి కాలంలో ఈ వలలోనే కదా ఎప్పుడూ ఉండేది.అందుకనే ఈ వలలో కొంచెమైనా తెలుగు ఉండడం మంచిది.
ఈ మధ్య కేసీఆర్ తెలుగు గురించి తెలిసినవీ తెలియనవీ వాగినట్లు తెలిసింది. అలాంటివాడికి తగినశాస్తి జరిగేరోజులొచ్చాయి
సరేనండీ ఇప్పటికే తెలుగు ఉపన్యాసంతో మీ బుర్ర తినేసినట్టున్నాను. ఈసారి మంచి తెలుగు కబుర్లతో మీ ముందుకొస్తాను.
ఇట్లు
మీ వాసుగాడు
తేట తేట తెలుగులా!
Wednesday, November 15, 2006
Subscribe to:
Post Comments (Atom)
3 అభిప్రాయములు:
తెలుగుబ్లాగు లోకాని స్వాగతం! :-)
నాపేరుతో బలేరాసావే ఎవరు? ఎక్కడుంటావు
Hello Anonymous
Nenu bangalore lo untaanu
Post a Comment